Tuesday 22 August 2017

ప్రముఖ నాద బ్రాహ్మణులు

ప్రముఖ నాద బ్రాహ్మణులు
1.పద్మశ్రీ ఉప్పలపు శ్రీనివాస్ - మాండోలిన్ విధ్వాంసులు.
2.డా.అన్నవరపు రామస్వామీ- వయొలిన్  విధ్వాంసులు.
3.ఉప్పలపు రాజేష్- మాండోలిన్ విధ్వాంసులు.
4.పద్మశ్రీ కదరి గోపాల్ నాధ్- సాక్సోఫోన్ విధ్వాంసులు.
5.డా.దండముడి సుమతి గారు- మృదంగం విధ్వాంసురాలు.భారతదేశములో మహిళ మృదంగ విధ్వాంసులలో డాక్టరెట్ పోందిన మొట్టమొదటి మహిళ.
6.కారైక్కుడి అరుణాచలం- ప్రముఖ నాదస్వర విద్వాంసులు.
7.నాద లయబ్రహ్మ పద్మశ్రీ ఎ.కె.పల్లానివేల్ - ప్రముఖ డోలు విధ్వాంసులు.
8.వలయపట్టి సుబ్రమణ్యం- ప్రముఖ డోలు విధ్వాంసులు
9.ఎ.కె.సి.నటరాజన్- ప్రముఖ కిలార్నెట్ విధ్వాంసులు.

తెలుగు నాదబ్రాహ్మణ సంగీత విధ్వాంసులు
1.దాలిపర్తి పిచ్చహరిపండిత్, సూర్యనారాయణపండిత్ సోదరులు 1918.
2.సిరిపురం పాపన్న పండిత్ 1875
3.కాకుమాను రామచంద్రయ్య పండిత్ 1880
4.
5.నూతలపాటి శ్రీరాములు పండిత్ 1890
6.దోమాడ చిట్టబ్బాయి మల్లాం 1933
7.చింతలచెర్వు వెంకటేశ్వర్లు పండిత్ దంపతులు
8.రావులకోల్లు సోమయ్య పండిత్ గారు సంగీత పండితులు
9.మార్టూరు వెంకటేశ్వర్లు పండిత్, హైమావతి పండిత్ దంపతులు.
10.నాదబ్రహ్మ పండితారాజుల విశ్వనాధం పంతులు - తిరుపతి కి చేందిన ప్రముఖ సంగీత ఉపాధ్యాయులు.
11.ఆంధ్రరత్న కె.వెంకటగిరి శ్రీనివాసులు - ప్రముఖ నాదస్వర విధ్వంసులు, కంచికామకోటి ఆస్థాన విధ్వంసులు.
12.ఓ.రవికుమార్ - ప్రముఖ నాదస్వర విధ్వంసులు, శ్రీకాలహస్తి మరియు కంచి కామకోటి ఆస్థాన విధ్వంసులు
13.శ్రీ పైడి స్వామి గారు రేపల్లె కి చేందిన ప్రముఖ నాదస్వర విధ్వంసులు, ప్రముఖ గాయని S.జానకి గారికి సంగీతము నేర్పిన గురువు.
14.చేరుకురి శ్రీశైలం గారు, బాపట్లకి చేందిన ప్రముఖ నాదస్వర విధ్వంసులు.
15.యాలురి లక్ష్మణ శ్రీనివాసులు - తిరుపతికి చేందిన ప్రముఖ డోలు విధ్వంసులు మరియు సంగీత కళశాల ఉపాధ్యాయులు.
16.తరిగోపులు నారాయణ - ప్రముఖ డోలు విధ్వాంసులు.
17.దువ్వురు వెంకయ్య - ప్రముఖ నాదస్వర విధ్వాంసులు.
18.గుంటుపల్లి రామమూర్తి - ప్రముఖ నాదస్వర విధ్వాంసులు.
19.గుంటుపల్లి విఠల్ దాసు - ప్రముఖ నాదస్వర విధ్వాంసులు.
20.మార్టురి వెంకట రత్నం - ప్రముఖ నాదస్వర విధ్వాంసులు.
21.ఒంగోలు యన్.రంగయ్య - ప్రముఖ నాదస్వర విధ్వాంసులు.
22.మున్నంగి ఆంజనేయులు - ప్రముఖ నాదస్వర విధ్వాంసులు.
23.అన్నవరపు బసవయ్య- ప్రముఖ డోలు విధ్వాంసులు.
24.తిరుపతి ముని రామయ్య- ప్రముఖ డోలు విధ్వాంసులు.
25.నిడమానురి లక్ష్మి నారాయణ- ప్రముఖ డోలు విధ్వాంసులు.
26.అన్నవరపు గోపాలం- ప్రముఖ డోలు విధ్వాంసులు.
27.పాతపాటి పిచ్చయ్య- ప్రముఖ డోలు విధ్వాంసులు.
28.భూసరపల్లి వెంకటేశ్వర్లు- ప్రముఖ డోలు విధ్వాంసులు.
29.భూసరపల్లి ఆదిశేశయ్య- ప్రముఖ డోలు విధ్వాంసులు.

నాద బ్రాహ్మణ సమాజం


"వేదం" ఎంత గోప్పదో "నాదం" కుడా అంతే గోప్పది.పురాతనకాలం నుండి నాదబ్రాహ్మణులు సంగీతములో సుప్రసిద్ధులు. సంగీత విధ్వాంసులని "నాదబ్రాహ్మణులు మరియు శబ్ధ బ్రాహ్మణులు గా పరిగనిస్తారు. 
వేదాన్ని మంత్రోచ్చారణ తో పలికే వాడు వేద బ్రాహ్మణుడు!
నాదాన్ని సంగీతోచ్చారణ తో పలికించే వాడు నాద బ్రాహ్మణుడు!
సైన్స్ ప్రకారం ఏవైనా రెండు ఘన, ద్రవ, వాయు పదార్థాల తాకిడివల్ల వచ్చేది శబ్దం లేక నాదం. ఆ నాదం నుంచి ఉదయించిందే వేదం.
సంగీతం సామవేద సారం. సంగీతం నాదమయం. నాదమంటే? ’న’ కారానికి ప్రాణమని, ’ద’ కారానికి అగ్ని అని ప్రాణాగ్నుల సంయోగంతో ఉద్భవించేదే నాదమని శాస్త్రం చెప్తుంది.
నాదం అనగా బ్రహ్మం!
నాదం పరబ్రహ్మ స్వరూపం!
వేదం మహావిష్ణు స్వరూపం!

ఈ సృష్టి అంతా నాద బ్రహ్మమయం. సర్వము అక్షరాత్మకము, వైఖరి శబ్ద బ్రహ్మమయము. శబ్దమే బ్రహ్మము. నాదమే బ్రహ్మము. అక్షరములు అచ్చులు, హల్లులు పరమ శివుని చే అనుగ్రహింప బడినవి. ఒక్కో వర్ణము ఒక్కో దేవతను, తత్వమును సూచించును. కావున అక్షరములన్నియు మంత్రము లగుచున్నవి. అందుకే ఆ సర్వమంగళ మాతృకావర్ణ రూపిణి అయినది. సర్వ వర్ణములలో మొట్ట మొదటి అక్షరము అయిన “అకారము” శివుడు, ప్రకాశము. అంత్యాక్షరమైన “హకారము” శక్తి, విమర్శము. వీని సామరస్యమే “అహం”. అచ్చులు శక్తి రూపములు. హల్లులు శివ రూపములు. ఓం కారము నుండి సకల వర్ణములు ఉత్పన్నము లైనవని వేదములు, పురాణములు ఘోషించు చున్నవి. 
ఓం ధ్వని పరబ్రహ్మము. మూలాధారాది షట్చక్రముల తాకిడిచే వర్ణముల ఉత్పత్తి గల్గును అని తంత్రములు చెప్పుచున్నవి. ప్రతి శబ్దమునకు ఒక్కో అర్ధము కలదని, శక్తి, ఈశ్వర తత్వముల కలయక నుండి ధ్వని పుట్టు చున్నదని మంత్ర శాస్త్రములు చెప్పు చున్నవి. అకారాది హకారాంతము వరకు గల ఏబది వర్ణములు మాతృకా వర్ణములు.


సంగీతాముకి మూలపురుషులు నాదబ్రాహ్మణులే!
శాతాబ్ధాల క్రితం చుసుకుంటే నాదబ్రాహ్మణులు సంగీతానికి మూలపురుషులు.
9వ శాతాబ్ధములో తమిళనాడుకు చేందిన గోప్ప కవి "మనిక్కవర్" మన కులము వారే, వీర శైవ తమిళులు ఆయనను ఆ శివును అవతారనుగా పూజించేవారు.
అలాగే 12వ శాతాబ్ధానికి చేందిన తమిళ రామయాణం రచేయిత "కాంబర్" నాదబ్రాహ్మణుడు వాల్ల పూర్వ వంశీయులంత "నాదస్వర విధ్వంసులు", కాంబర్ రాసిన రామయణము "కంబ రామయణం" గా ప్రసిద్ధి చేందినది.

సంగీతంలో విజ్ఞానం, ఆనందం దాగి ఉంది.సంగీతం పైన ప్రతి ఒకరికి ఆసక్తి ఉంటుంది.ఇది మన విద్య, మన సాంప్రధాయం.సంగీతం మన భవిష్యత్ సంపద.వజ్రం కంటే విలువైనది మన సంగీతం దానిని మనమే కాపాడుకోవాలి.

సంగీతం అంటే??
ఓంకారం ఆది ప్రణవ నాదం.భాష పుట్టుకకు ఓంకారం మూలం.సమస్త విద్యలు ఓంకారావిర్భవితాలే.ఓంకారం నుంచే సంగీతం ఆవిర్భవించింది.
సామవేదం:-
సామం అనగా మధురమైనది,వేదం అనగా జ్ఞానం.సంగీతం ఉత్తేజాన్నిస్తుంది.మానసిక జ్ఞానాన్ని ప్రసాదిస్తూంది.

భారతీయ సంగీతవిద్యలో రెండు ముఖ్య విభాగాలు.
ఒకటి కర్ణాటక సంగీతం,రెండవది హిందుస్తానీ సంగీతం.
గాత్రం,వాద్యం సంగీతంలో విభాగాలు.
గాత్రం సంగీతంలో అతి ముఖ్యమైనది.
వాద్యం గాత్రానికి సహాయం చేస్తుంది.

నాద స్వరం
డోలు
హార్మోని
వయోలిన్
పిల్లన గ్రోవి(flute)
వీణ
మృదంగం
తబలా
సితార్
ఇందులో ఏది తక్కువని అనుకున్న మనల్ని మనం తక్కువ అనుకున్నట్లే.ఈ విద్య నేర్చుకుంటే తెలుస్తుంది ఈ విద్య గొప్పదనం.

వైద్యం లో భాగము సంగీతము :-
సైన్స్ ప్రకారం వైద్యము నుండి వెలువడినదే సంగీతం, వైద్యము చేసేటప్పుడు రోగి మనస్సు ప్రశాంతముగా ఉండటానికి వైద్యులే సంగిత వాద్యాలను వాయించేవారు ప్రస్తూత రోజులలో దినినే "మ్యూజిక్ ధెరపి(music therapy)" అంటున్నారు.
పురాణకాలం నుండి నాదబ్రాహ్మణులు రాజుల దగ్గర ఆస్తాన విధ్వాంసులుగా ఉండి వారి మన్ననలు పోందేవారు.వారు వారి వాద్యముతో రాజులను, సామన్య ప్రజలను సైతం ఆహ్లదపరిచేవారు.
ప్రస్తుత రోజులలో నాదబ్రాహ్మణులు :
ప్రస్తుత రోజులలో నాదబ్రాహ్మణులు అనేక హిందు దేవాలయలలో ఆస్తాన విధ్వాంసులుగాను మరియు గాయకులుగాను ఉంటున్నారు.

ప్రసిద్ధి పోందిన కోందరు నాదబ్రాహ్మణులు :-
● పద్మశ్రీ ఉప్పలపు శ్రీనివాస్(మాండోలిన్ శ్రీనివాస్)
● డా.అన్నవరపు రామస్వామి(వయొలిన్  విధ్వాంసులు)
● పద్మశ్రీ కధరి గోపాల్ నాధ్- సాక్సోఫోన్ విధ్వాంసులు
●డా.దండముడి సుమతి గారు- మృదంగం విధ్వాంసురాలు.భారతదేశములో మహిళ మృదంగ విధ్వాంసులలో డాక్టరెట్ పోందిన మొట్టమొదటి మహిళ.
●దాలిపర్తి పిచ్చహరి పండిత్- నాదస్వర విధ్వాంసులు
●దోమాడ చిట్టబ్బాయి- నాదస్వర విధ్వాంకోందరు
● ఎ.కె.సి.నటరాజన్- ప్రముఖ కిలార్నెట్ విధ్వాంసులు
● కారైక్కుడి అరుణాచలం- ప్రముఖ నాదస్వర విద్వాంసులు.
● నాద లయబ్రహ్మ పద్మశ్రీ ఎ.కె.పల్లానివేల్ - ప్రముఖ డోలు విధ్వాంసులు.
● పద్మశ్రీ వలపట్టి సుబ్రమణ్యం- ప్రముఖ డోలు విధ్వాంసులు
● శ్రీమతి దాలిపర్తి.ఉమ మహేశ్వరి- హరికధ  కళాకారిని.



                   🙏మీ🙏

          ____ రావులకోల్లు
  (🎵అఖీల భారత నాదబ్రాహ్మణ సమాజం🎵)